ఆయతుల్ కుర్సీ గొప్పతనం

పవిత్ర ఖురాన్‌లోని అన్ని ఆయత్లలోకెల్లా అత్యంత మహత్తరమైనది ఆయతుల్ కుర్సీ (సూరా బఖరహ్ ఆయత్ 255). ఉబయ్య్ ఇబ్న్ కఅబ్ (రజి) తో ప్రవక్త (స) మాట్లాడుతూ ఖురాన్‌లోకెల్లా అత్యంత గొప్ప ఆయత్ ఇదేనని ధృవీకరించారు (సహీహ్ ముస్లిం: 810).

అరబిక్ ఉచ్చారణ మరియు తెలుగు అర్థం

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్...

"అల్లాహ్! ఆయన తప్ప ఆరాధ్యుడెవరూ లేడు. ఆయన సజీవుడు, సమస్త సృష్టిని నియంత్రించేవాడు. ఆయనకు మత్తు గానీ, నిద్ర గానీ పట్టవు. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు?..."

నిత్య జీవితంలో ప్రయోజనాలు

ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ పఠించే వ్యక్తికి మరియు స్వర్గానికి మధ్య మరణం తప్ప మరే అడ్డంకీ ఉండదు (నసాయి: 9928). రాత్రి నిద్రపోయే ముందు చదివితే తెల్లవారే వరకు అల్లాహ్ తరఫున ఒక దేవదూత రక్షణగా ఉంటాడు, షైతాన్ దరిచేరడు.