ఫిత్రా ఎందుకు విధి చేయబడింది?

ఇబ్న్ అబ్బాస్ (రజి) తెలిపారు: "ప్రవక్త (స) సదఖతుల్ ఫిత్ర్‌ను రెండు కారణాల వల్ల ఫర్జ్ చేశారు: ఒకటి, ఉపవాసంలో జరిగిన పొరపాట్లను శుద్ధి చేయడానికి; రెండు, ఈద్ పండుగ రోజున పేదలకు ఆహారం సమకూర్చడానికి" (అబూ దావూద్: 1609).

పరిమాణం మరియు సమయం

ప్రతి వ్యక్తికి ఒక 'సాఅ' (సుమారు 2.5 నుండి 3 కిలోల గోధుమలు, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లేదా దానికి సమానమైన నగదు). కుటుంబ యజమాని తనతో పాటు తన ఆధ్వర్యంలో ఉన్న పిల్లలు, ఆశ్రితులందరి తరఫున చెల్లించాలి. ఈద్ నమాజ్‌కు ముందే దీనిని పేదలకు అందజేయడం తప్పనిసరి.