అల్-ఫారూఖ్ పాలనా వైభవం
ఇస్లాం రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రజి) న్యాయానికి మారుపేరు. "యూఫ్రటీస్ నది ఒడ్డున ఒక కుక్క ఆకలితో చనిపోయినా, రేపు పరలోకంలో ఉమర్ దానికి జవాబు చెప్పుకోవాలి" అని భయపడేవారాయన.
సంక్షేమ రాజ్య స్థాపన
- రాత్రిపూట మారువేషంలో స్వయంగా వీధుల్లో తిరుగుతూ పేదల కష్టాలు తెలుసుకునేవారు.
- ప్రపంచంలోనే మొట్టమొదట వృద్ధులకు, వితంతువులకు, బాలింతలకు ప్రభుత్వ పింఛను వ్యవస్థను ప్రవేశపెట్టారు.
- హిజ్రీ క్యాలెండర్‌ను అధికారికంగా అమలుపరిచారు.