ఇస్తిగ్ఫార్ వల్ల కలిగే ఐహిక లాభాలు
హజ్రత్ నూహ్ (అ) తన జాతితో చెప్పారు: "మీ ప్రభువును క్షమాపణ కోరండి (ఇస్తిగ్ఫార్ చేయండి). నిశ్చయంగా ఆయన క్షమాశీలి. ఆయన మీపై ఆకాశం నుండి కుండపోతగా వర్షాలు కురిపిస్తాడు, మీకు సంపదను, సంతానాన్ని ప్రసాదిస్తాడు, మీ కొరకు తోటలను, నదులను సృష్టిస్తాడు" (సూరా నూహ్: 10-12).
కష్టాల నుండి విముక్తి
ప్రవక్త ముహమ్మద్ (స) తెలిపారు: "ఎవరైతే నిరంతరం ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారో, అల్లాహ్ అతనికి ప్రతి కష్టం నుండి ఉపశమనం కలిగిస్తాడు, ప్రతి ఇరుకు నుండి మార్గం తెరుస్తాడు, మరియు ఊహించని మార్గాల ద్వారా జీవనోపాధిని అందిస్తాడు" (అబూ దావూద్: 1518).